భగవద్గీత

111098 భగవద్గీత - అర్జున విషాదయోగము

"The Bhagavad Gita in the light of Yoga - Arjuna Vishadayogam - భగవద్గీతను యోగ విద్య పరంగా మనం అర్థం చేస్కొనే ప్రయత్నం చేస్తున్నాము. గీతలోని 18 అధ్యాయాలను మనం అర్థం చేస్కొని, 18 రకాల యొగములను గూర్చి నేర్చుకుని చివరికి మోక్ష సన్యాస యోగమును నేర్చుకుంటాము. మానవ శరీరము మనకు లభించటమే గురువు యొక్క వరదానం. లక్షల సంవత్సరాలుగా మనం ఆ గురువు యొక్క అనుగ్రహంలోనే ఉన్నాము. పాండవులకు కోరికలు లేవు, అడవిలో ఉండమంటే అడవిలో ఉన్నారు, విరాట్ పర్వంలో వాళ్ళు చేసిన పన్లు చూస్తే ఇవి రాజులు చేసే పన్లేనా అనిపిస్తుంది, వాళ్ళను ప్రకృతి ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నారు. మన హృదయంలో ఉన్న గురువు ఏది నిర్దేశిస్తే అది మనం ఆచరించటమే.

121098 భగవద్గీత - అర్జున విషాదయోగము

The Bhagavad Gita in the light of Yoga- Arjuna Vishadayogam - యోగము అనేది సాధన చేసేది కాదు, ఆ విశ్వరూపాన్ని నీ ప్రయత్నాలవల్ల చూడలేవు. మీ సాధనలతో ఆ భగవంతుని పొందుతాము అని అనుకుంటే వెంట్రుకని కట్టి కొండను లాగినట్లే. "దివ్యం దాదమి తేచక్షు:" నీకు కావలసినటువంటి ఆ దివ్యమైన చక్షువు నేను ఇస్తాను. ఆయన ఇవ్వకపోతే మీరు చూడలేరు. ఇవ్వవలసింది ఆయన, చెయ్యవలసింది ఆయన, ఉపనిషత్తులలో కూడా ఆ మాట చాలా స్పష్టంగా చెప్పబడింది. "ఆయన వరించాలి, మనం కాదు."

131098 భగవద్గీత - అర్జున విషాదయోగము

The Bhagavad Gita in the light of Yoga- Arjuna Vishadayogam - భగవద్గీత యొక్క చాలా అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే, ఈ పృధ్విమీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఈ సాధకుడియొక్క ఫలితం లభిస్తుంది. గీత యొక్క అధ్యాత్మిక శక్తి సంపన్నత ఎంత గొప్పది అంటే, అధ్యాయంలోని నాల్గవ భాగాన్ని ఆచరించినా, ఈ మన్వంతర కాలమంతా మీరు మానవ జన్మని పొందుతూ, ఋషుల స్థాయిలోనే జీవిస్తారు. గీతలోని 18 అధ్యాయాలలోని 10 శ్లోకాలు చాలు మిమ్మల్ని ఆ స్థితికి తీస్కొని వెళ్ళటానికి.

141098 భగవద్గీత - అర్జున విషాదయోగము

The Bhagavad Gita in the light of Yoga- Arjuna Vishadayogam - బాహ్య పరిస్థితులకు రియాక్ట్ కాకుండా ఉండగలిగే మానసిక స్థితి జీవన్ముక్త స్థితి. ఆ స్థితిలో సర్వరోగాలు నివారింపబడతాయి. సర్వ బాధలు. సకల సమస్యలు నివారింపబడతాయి. మన విషాదానికి కారణం ఏమిటి అంటె మనలో ఉన్నటువంటి "మార్గదర్శకుడు", మనలో ఉన్నటువంటి "గురువు", మనలో ఉన్నటువంటి "స్నేహితుడు", మనలో ఉన్నటువంటి "బంధువుని" వదిలేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతాం. అదే విషాదానికి కారణం. మన సూక్ష్మ శరీరంలోని 5 చక్రాలు వేరు వేరు మార్గాలలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని ఆజ్ఞాచక్రంలోని గురువు ఆజ్ఞలకి అనుగుణంగా నడిపించగలగాలి, ఏది తప్పో, ఏది సరైన మార్గమో మనకి ఈ మొదటి దీక్షలో అర్జున విషాదయోగంలో నేర్పబడింది.