Our Master's Voice

మన మాష్టారి వాణి - వైజ్ఞానిక ఆధ్యాత్మికతకు కొత్త బాణి
1998 YEAR

జనవరి

010198 గురుసత్తా కాకివాయి

గురువుల మార్గములో మనము నడవదలుచుకున్నపుడు మౌనమే శరణ్యము. శ్వాస ని సవరించుకుని ద్వాదశ రాశులలో వున్న మాలిన్యాలను తొలగించుకోవాలి. ఈ శ్వాస ఆ గురువు యొక్క రెండు పాదాలు, గురుపాదుకాస్తవము భరతుడు రాముడి పాదుకలు పూజించినప్పటి నుంచి మొదలయింది. నా యొక్క ఉపిరి నీ పని చేయడానికి మాత్రమే వున్నది అనేటటువంటి భావన వుండాలి

02011998 సూర్యోపాసన

సూర్యుడి యొక్క దివ్యత్వం మనలో ప్రవేశించడంవల్ల మనము బ్రతికి ఉన్నాము. దాన్ని దర్శించడం, ప్రతి వాళ్ళలో అది చూసేటటువంటి శక్తిని ఇచ్చేదే సంధ్యావందన ప్రక్రియ. మనము ఏ పేరుతో పిలిచినా పలికేది సూర్యుని యొక్క శక్తే. ఆ సూర్యుని యొక్క మూడు లెవల్స్ మీరు పట్టుకోవాలి అది దత్తాత్రేయుడి యొక్క శక్తి

01011998 గురుసత్తా పూజా విధానము - కాకివాయి

గురునామ స్మరణ చెయ్యటమువల్ల భుక్తి ముక్తి రెండూ కలుగుతాయి, ఆ గురువు యొక్క అభయ వరదాన ముద్రలను మానసికంగా దర్శించాలి, ఆ అనుభవము ఆ శాంత మూర్తి ని మీరు దర్శించి అదే శాంత స్ధితి మీకు కలగాలి. ఆ భావన చాలా ముఖ్యము.

14011998 కార్యవర్గ సమావేశము

ఏదన్నా ఒక మంచి పాట వింటే లయ బధ్ధంగా మీరు శరీరాన్ని కదిలిస్తే దాని ప్రభావము మీ సూక్ష్మ శరీరము మీద పడుతుంది. సర్వ సమర్ధుడు, సర్వ వ్యాపకుడూ, సర్వాంతర్యామి గురువు వద్దకు వెళ్ళి ఏమి అడగాలో తెలియని నీచ స్ధితిలో భారతీయులు ఉండటము దుర్భాగ్యము. మీ భావాలను సరిచేసుకోండి.

ఫిబ్రవరి

250298 చక్రధ్యానము

ఆ యోగమాయా శక్తి పంచభూతాలు పంచాతత్వాలు రూపం లో మనల్ని ఆవరించుకొని వుంటుంది. ఆ యోగ శక్తి యొక్క జాగరణ కొరకు ఈ సాధన చేస్తున్నాము. ఆ యోగమాయ యొక్క అభయాన్ని స్వీకరించండి. ఆమె యొక్క చరణాల యొక్క పిల్లలము మనము అనేటటువంటి భావన తెచ్చుకోండి. మణిపూరక చక్రం నుంచి ఆజ్ఞ వరకు వున్నఒకొక్క దళము యొక్క ధ్యానము

మార్చి

300398 రామనామ ధ్యానము

As above so below అనే ఒక్క సిద్ధాంతము గుర్తుపెట్తుకుంటే మీరు ఆ వాక్శక్తిమీద మీరు ధ్యానాన్ని పెట్టండి. రామ అని మనము ఉచ్చారించటముతో వాక్శక్తిని మీరు కొలవగలిగితే మీరు ఆకాశాన్ని కొలవగలరు. అంత శక్తిన నామ జపముతో సాధించవచ్చు. రామో విగహవాన్ ధర్మ:

ఏప్రిల్

250498 దత్త విగ్రహ ప్రతిష్ట

యుగసంధి అనేది ప్రకృతిలోని ఒక్క ధర్మము. విశ్వము అంతటి యొక్క అజ్ఞాన్నాని పోగోట్టేటటువంటి జ్ఞాన జ్యోతి ఈ యుగసంధి కాలలం లో వెలుగుతూ వుంటుంది. ఈ దేహమే దేవాలయము. మీరు ఋషులలో ఏ గొప్పతనాని అయితే చూస్తున్నారో ఆ గొప్పతనాని ఈ శరీరం ద్వారానే ప్రకటించుకోవచ్చు

120498 కాలమును ఉపయోగించటం

మొత్తం హ్యుమానిటీ ౩ జగత్తులో జీవిస్తూ వుంటుంది జాగృత, స్వప్న, సుషుప్థ . కాలము అనేది మనకి జాగ్రుతావస్థ లోనే వుంటుంది . స్వప్నా వస్థలో కాలము వుంది కానీ దాని స్కేల్ వేరు . భౌతిక జగత్తులో వున్న కాలము మాత్రము మనుషుల అందరిలో వున్నది.కాలము దాన్ని యొక్క ధర్మాలు తెలుసుకోవాలి.

010498 ఋషి ప్రణాళికా అవతరణ కూటమి

" మనము కాలాన్ని మార్చుకోవచ్చు.కాలం యొక్క వేగం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ధర్మము ఆలోచనలు ఎలా మార్చుకోవాలి అనేది చెప్తుంది. టైం యీస్ మనీ. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయాలి. ధర్మము శాశ్వతమైనటు వంటిది అయినప్పటికీ అది నిత్యనూతనమైనది."

020498 ఋషి ప్రణాళికా అవతరణ కూటమి

యజ్ఞము అనేది చేసేది కాదు జరిగేది. మనము ఏం చేసాము అనేదే ధర్మం చూస్తుంది తప్ప నువ్వు ఏం కోరుకుంటునావో ధర్మం చూడదు. నువ్వు ఎంత కర్మ చేస్తావో అంత నీకు లభిస్తుంది. ఏ ధర్మానికి ఏ కర్మ చేస్తునమో దానికి తగ్గిన లాభం వస్తుంది.

240498 శ్రీ కళానిధి ట్రస్ట్

అమావాస్య, పౌర్ణమికి మధ్య వుండే ఒకొక్క కోణాన్ని కళలు అంటాము. ఈ కళలన్నిటి లోను ముఖ్యమైనటువంటి కళ శ్రీం, శ్రీం అనేటటువంటి 15కళలు ఆ చంద్రుడి యొక్క 16 కళల యొక్క నిధి అదే శ్రీకళ్ళానిధి. ఔషదుల్లలో రసాని ప్రోదీకరించి ఆ ఔషదుల్లలో రోగనివారణ శక్తిని ఆ చంద్రుడు ఇస్తున్నాడు. మనము మర్చిపోయినటువంటి చంద్ర విజ్ఞాని తిరిగి తెచ్చుకుందాము

250498 సిద్ధి రాజు వార్షికోత్సవము

షిరిడి సాయి జీవిత చరిత్ర చదువుతే మనకు అక్బరు గురుంచిన విశేషమైన విషయాలు తెలుస్తాయి. భారత దేశము ముస్లింల పాలనలో ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మచారి మహా యీగి 350 సంవత్సరాల పైన వయస్సు ఉన్న ఒక మహా యోగి భారతదేసములో మరి ఏ ఇతర మతాల రాజ్యము ఉండకూడదని ప్రయత్నము చేసాడు, అతనే షిరిడి సాయి యూక అనుగ్రహముతో అక్బరుగా జన్మ ఎత్తాల్సి వచ్చింది. గురువుల జీవిత చరిత్రలు సరిగ్గా చదవటము నేర్చుకోండి.

మే

070598 ప్రేమ ధ్యానము

పరస్పరం కలిసి పని చెయాలి అనేది నేర్చుకోవాలి అందుకోసం ప్రేమతత్వము ధ్యానము చేయాలి. ఈ ధ్యానములో మనం నిరంతరం మట్లాడుకుంటూ వుంటాం. ప్రేమతత్వములో దు:ఖమే తప్ప సుఖం వుండదు కానీ ఆ దు:ఖమే సుఖం గా అనిపిస్తుంది. ప్రతి రోజు ప్రొద్దున్న సాయంత్రం ప్రేమ గురించి ఆలోచించుకుంటూవుండాలి.

130598 ప్రేమ ధ్యానము

మీరు ఏ ధర్మాన్నైనా పాటించండి తప్పులేదు, కానీ మీ 5 ఇంద్రియాల యొక్క శక్తిని ఉపయోగించుకోగలిగితే, వాటికి పైనున్న మనస్సును ప్రేమ తత్వముతో నింపుకోగలిగితే ఆ ధర్మము మాత్రమే నిజమైన ధర్మము, మిగతా అన్ని ధర్మాలు నటనే.

130598 గురు తత్వము

మన మనో భూమిలో సర్వ సమర్ధుడు, సర్వ వ్యాపకుడు, సర్వాంతర్యామి ఐన గురువు క్షేత్రములో నాటవలసినవి . మొదటి కర్మ - భూమి, రెండవ కర్మ - జలము , మూడవ కర్మ - సూర్య కిరణాలు. శ్రధ్ధ , ప్రజ్ఞ, విశ్వాసము అనేవి లోపిస్తే మీలో బీజరూపములో ఉన్న గురుతత్వము అంకురింఛలేదు. మనో భూమిలో సేవ అనే గుణము ఉంంటేనే కానీ ఆ గురువుయొక్క అనుగ్రహము ప్రవహించదు.

జూన్

260698 యోగ స్ధితి మౌనము

సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్ధ సంయమనము అను నాలుగు స్తంభాలపై సాధకుడి శిక్షణ ఆధారపడి ఉంటుంది, నిరంతరము మౌనంగా ఉండలేకపోతే స్వాద్యాయముకానీ, మీకు ఇషటమైన స్తోత్ర పఠనము కానీ చెయ్యాలి.

280698 నిరంతర గురుసాన్నిధ్య అనుభూతి సాధన

నిరంతర గురుసాన్నిధ్య అనుభూతి అంటే అది మొదటి సాధన, భగవద్గీత జగద్గురువు భారతాజతికి అందించిన మొదటి వరము, గురువుని ఏమీ అడగడు, ఆ గురువు యొక్క నిరంతర స్మరణ జరగాలి, మన హృదయాలలో ఉన్న సర్వ వ్యాపి, సర్వ సమర్ధుడు, సర్వాంతర్యామి గురువుతో మీరు అనుసంధానంగావించుకోవటమే మొదటి అడుగు.

280698 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము

ఏ దేవాలయానికి వెళ్ళినా ఒకే ఫలితము వస్తుంది అనే మూర్ఖత్వము నుండి మీరు బయటపడాలి, సాధారణ కోరికలు తీరటము, భుక్తి ముక్తి వంటివి అన్ని దేవాలయాల్లోనూ వస్తుంది, కానీ సాధకులుగా మీరు ఒక ప్రత్యేక విద్యను నేర్చుకోదలచుకున్నప్పుడు ప్రత్యేకమైన దేవాలయాలలో సాధన చెయ్యటము అనివార్యము అని తెలుసుకోండి.

జులై

060798 గాయత్రి రామాయణము

గాయత్రి రామాయణము

090798 గురుపూర్ణిమ

గ్రహించే టటువంటి మానసిక స్థితి దాన్నినే ధారణ అంటాము. చెవుల మీద ఏకాగ్రత.యోగులుగా మారాలి ప్రతి మానవుడు.ఆలోచనా రహిత క్షణాలు అన్ని కూడా ఆ విశ్వరుపుడైన వాసుదేవుడు వున్నాడు.ఏది ఆశించకుండా అసలు ఆలోచనలు లేనటువంటి స్థితి లో యోగము యొక్క స్తార్తింగ్ పాయింట్.

250798 శరీర నిర్మాణము

ప్రపంచములో ద్వాదశరాసులు ప్రతి వ్యక్తిపై ప్రభవాన్ని చూపిస్తాయి, సూర్యనమస్కారములు చెయ్యటంవలన సర్వ సమర్ధత పెంచుకునేందుకు కావలసిన మార్పులు మన శరీరములో జరగట అనికి అనువుగా మన శరీరము మార్పు చెందుతుంది. డాక్టరు ఇచ్చిన మందు ప్రభావము మన శరీర శక్తి పై ఆధారపడి పని చేస్తుంది, అంంటే జరిగేమార్పు మన శరీరములోనే జరుగుతుంది. ఎన్నో అద్భుత వనరులున్న ఈ భౌతిక శరీరమును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి.

280798 కలియుగం

ప్రపంచంలో జరిగే చాలా సంఘటనలు శాంతం గా జరుగుతాయి,సూర్యోదయము,సూర్యాస్తమయాలు చాలా ప్రశాంతం గా జరుగుతాయి.మనిషి ప్రతి రోజు పెరుగుతాడు ఎంత నిశబ్దం గా జరుగుతోంది అలానే ప్రపంచంలో ఎక్కడ చూసినా పెరగటం అనేది ఒక అద్బుతమైనటువంటి రహస్యము..భగవంతుడు గురించి మీరు తెలుసుకోవాలి అంటే వినటం నేర్చుకోవాలి .ఏకాగ్రమైనటు వంటి వినగలిగేటటువంటి శబ్దాన్ని మీరు ఎక్కడ విన్నా భగవంతుడు కనిపిస్తాడు.మంత్రమైనా, ప్రాణాయామము చేసినా అది వినాలి.

010798 నిరంతర గురుసాన్నిద్యము

ఆధ్యాత్మికతని అనేక రకాల టెక్నాలజీలతో డెవలప చేసాము. గురువు ఇచ్చేటటువంటి ప్రతిఫలము ఎప్పుడు మనము ఇచ్చిన దానికన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా వుంటుంది.మనము చేస్తున ప్రతి పని గురువు చూస్తున్నాడు అనేటటువంటి మానసిక స్థితి వుండాలి

020798నిరంతర గురుసాన్నిద్యము

నిరంతర గురువు యొక్క అనుభూతి. అది పొందాలి అంటే ఆవిధమైన అలవాటు రావాలి. ఆ జగద్గురువు అందరి హృదయాలలోనూ వున్నాడు దాన్నే అఖండమండలాకారము అంటాము. ఆ చేతనత్వము మనలో లేకపోతే మనము ఉండము. నిరంతరము నా హృదయములో గురువు వున్నాడు అనేటటువంటి అనుభూతి చెందాలి ,ఇది మొదటి మెట్టు

030798 నిరంతర గురుసాన్నిద్యము

అనంతమైనటువంటి విశ్వంలో అక్కడ వాకు లేదు. భూమి మీద ఉన్నటువంటి 83 లక్షల జీవరాసులలో కూడా వాక్కు లేదు. ఈ సంపూర్ణ సృష్టి యొక్క రహస్యం తెలియాలి అంటే మౌనం గా వుండడం నేర్చుకోవాలి. ప్రకృతికి మనల్ని మనం వదిలేసుకోవాలి మౌనంగా జరిగేది గమనిస్తూ వుండాలి.

040798 నిరంతర గురుసాన్నిద్యము యోగవిద్య

యోగ విద్య సాధకులు నిరంతము యోగ విద్య సాధకులే. అంటే యోగము తప్ప ఇంకేమి మాట్లాడం అని కాదు, అది బేసిస్ అని అర్ధం. దాన్ని మీద మిగతావన్నీ నిర్మాణం అవుతాయి.నిరంతరము ఆ గురువు యొక్క స్పర్శ అనుభూతి చెందాలి.

050798 నిరంతర గురుసాన్నిద్యము

మనవ జీవితం యొక్క అసలైన లక్షము ఏంటి అనేది తెలుసుకోవాలి.దానికి మనము శరీర నిర్మాణము గురించి క్లుప్తం గా కొంచము తెలుసుకోవాలి.ఎందుకంటే శరీరం యొక్క అవసరాలు మీ అవసరాలు అనుకుంటున్నారు.ఈ శరీరాలని కూడా మనము యంత్రాలలాగానే ఉపయోగించుకునే ట్రికులు నేర్చుకోవాలి.

090798 మౌనం ద్వారా గురుసన్నిధి

మనం కనుక నిరంతరము గురు సానిధ్యము పొందితే మనం యోగులము అవుతాము.మీ వాక్కు ద్వారా ఎదుటివారిని జడ్జ్ మెంట్ చేయకూడదు. రాత్రి పడుకునప్పుడు మనము సవ్యమైనటువంటి ఆలోచనలు చేస్తే లేచిన వ్యక్తీ పడుకున్న వ్యక్తి ఒక్కటి కాడు.

110798 నిరంతర గురుసాన్నిద్యము

మౌనం గా వున్నవాళ్ళు తపస్సు చేయడం నేర్చుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మప్రభువుని గుర్తుచేసుకోవడానికి మీరు ఆ ఆవేదనలో వుండి మౌనం లో ఉండగలిగితే అది తపస్సు యొక్క మొదట్టి స్థితి. మౌనంలో వుండి ఆ ఆర్తిని బయటికి రానివ్వండి.

110798 నిరంతర గురుసాన్నిద్యము 1

బౌతిక కోరికలని పూర్తిగా ఆపేయండి. పృద్వీ అంతా కూడా ఒక కుటుంబము అని అనుకోవాలి. ఈ విశేషమైనటువంటి స్థితి మౌనం ద్వారా వస్తుంది..వ్యక్తిగత జీవితం లో ప్రతి రోజు రాత్రి ఒక టైం టేబుల్ వేసుకోండి.అది ఆచరణలోకి తెచ్చుకోండి.

110798 నిరంతర గురుసాన్నిద్యము 2

పృద్వీ గ్రహము సౌరకుటుంబం లో ఒక విచిత్రమైనటువంటి స్థితి లో వుంటుంది ఎందుకంటే మానవీయ చేతనత్వము ఇతర గ్రహాలలో ఈ విధంగా వుండదు. అలాంటి భూమి యొక్క వాతావరణం కొన్ని మైళ్ళ వరకు విస్తరించి వుంది. ఇలాంటి మానవుడు యోగిగా మారితే ఈ సంపూర్ణ సృష్టిని మార్చగలడు. ఇది భారతీయత ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన జ్ఞానము

130798 మౌనం ద్వారా గురుసన్నిధి

మీరు నిజంగా మౌనం గా వుంటే ఈ దుఖ:ము మిమల్ని బాధించదు. ఏ బాధలు వచ్చిన ఆ మౌనం లో ఆహుతి వేయండి. బాధ్యతలని పరిపూర్ణంగా చేస్తూ మౌనం గా వుండాలి. యోగి అవ్వదలచుకుంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని యోగిలా జీవించటానికి అర్పించాలి

130798 నిరంతర గురుసాన్నిద్యము మౌనం

ఏ దేశం యొక్క గొప్పతనం అయినా ఆ దేశం లో ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి వుంటుంది. ప్రకృతి యొక్క సామర్ధ్యం ఏంటి అంటే ఎంత అవసరమో అంతే ఇస్తుంది. అలాగా మౌనాన్ని మీరు మీ లోపలికి తెసుకువెళ్ళండి అది ఎలా మార్చుకోవాలో అదే మార్చుకుంటుంది. ఎకడెక్కడ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవల్లసిన సమయం వస్తుందో అక్కడ మౌనం నుండి సమాధానము వస్తుంది

140798 నిరంతర గురుసాన్నిద్యము

యోగము అనే పదాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. నిరంతరం గురు సాన్నిధ్యం లో వున్నవాడే యోగి. సంచిత కర్మ నుంచి గురువు తొందరగా బయటకి తీసుకురాగలడు. మౌనం గా ఉండడానికి నిజంగా ప్రయత్నించాలి, ఎటువంటి కోరికలు ఉండకూడదు. ఎటువంటి పరిస్ధితిలో కూడా చలించము అనే మానసిక స్థితి వుండాలి

150798 నిరంతర గురుసాన్నిద్యము 1

భగవంతుడు అక్కడ వున్నాడు అనే భావన వుండాలి, ఉన్న భగవంతున్ని దర్శించాలి. మన స్ధాయి బట్టి వనరులు ఏర్పడుతాయి, కోరికల బట్టి ఏర్పడవు. గురువు దగ్గర వుంటే గురువు యొక్క వనరులు అన్ని మీ వనరులు అవుతాయి.

150798 నిరంతర గురుసాన్నిద్యము 2

మానవ జన్మ ఎత్తాక ఋషుల ఒక్కసాధనా విధానము వారు చెప్పినట్టు చేస్తే యోగ విద్య కూడా మీకు అలానే ఫలితాలని ఇస్తుంది . మీరు మీలోపలికి వెళ్ళండి, చిత్తవృతుల్ని నివారించుకోవాలి.

160798 నిరంతర గురుసాన్నిద్యము

యోగ సాధనికి ఇది సరైన సమయము. శరీరమనేటటువంటి స్థలము ఆ సమయానికి వుండాలి. ఆలస్యము, బద్ధకము వదులుకోవాలి. బిందువు వరుకు వెళ్ళండి అంతకంటే ముందుకు వద్దు వెనకకు వద్దు .

190798 నిరంతర గురు సాన్నిధ్య సాధనా శిబిరము

దుర్వాస మహర్షి మీరు చేసిన సాధనకు మెచ్చుకున్నారు, మీరు మీ బాధ్యతలను మరింత జాగురూకతతో చెయ్యవలసిన సమయము ఆసన్నమైనది. యుగసంధి సమయములో మీ సాధనకు తగ్గ సమయాన్ని జాగ్రత్తగా కేటాయించుకోండి, నిరంతరము మౌన స్ధితిలో ఉండండి. మీకు సప్త ఋషులు వచ్చి మార్గదర్శనము అందిస్తున్నారు, వారు ఏ రూపాలలో వచ్చారో మీరు పూర్తి జాగురూకతతో ఉండి గమనించుకోండి, గురుచరిత్రల పారాయణ వలన ఆ గురువు జీవితంలోని సంఘఠనలు సాధకులగా మీ జీవితాలల్లో కూడా జరుగుతే అప్పుడు మీరు ఎలా ప్రవర్తింఛాలో దానికి తగిన శ్క్షణ లభిస్తుంది.

290798 గురువుని గుర్తించటం

ఆధ్యాత్మికత మీద రుచిని కల్పించుకోవాలి. దేవాలయాలలో మనము కళ్ళుమూసుకుని దణ్ణం పెట్టుకుంటాం అంటే దేవుడు బైట లేదు మనలో వున్నాడు అని. వచ్చేట్టప్పుడు శఠకోపం పెట్టుకుని వస్తాము అంటే సర్వజ్ఞుడైన ఆ చరణాలను మనం తెసుకుని వస్తాము ఆ ఆచరణ మీకు రావాలి.

090798 యోగస్థితిని పొందడం

గ్రహించే టటువంటి మానసిక స్థితి దాన్నినే ధారణ అంటాము. చెవుల మీద ఏకాగ్రత.యోగులుగా మారాలి ప్రతి మానవుడు.ఆలోచనా రహిత క్షణాలు అన్ని కూడా ఆ విశ్వరుపుడైన వాసుదేవుడు వున్నాడు.ఏది ఆశించకుండా అసలు ఆలోచనలు లేనటువంటి స్థితి లో యోగము యొక్క స్తార్తింగ్ పాయింట్.

280798 యోగ సాధన

"మౌనం గా వుండి సర్వాంతర్యామి అయినటువంటి గురువు యొక్క స్పర్శ పట్టుకోవాలి. మనలో గురువు వుంటే ఆ సర్వసమర్ధతత,సర్వవ్యాపకత్వము మనలో కూడా వస్తుంది. మీరు ఎవరి దగరికి వెలకరలేదు ఆ గురువు మీలోనే వున్నాడు కానీ కోరికలతో కట్టేసి ఉంచారు గురువుని.అవి కనుక ఒక క్షణం పక్కన పెడితే మీ జీవితం లోనే కాక కొన్ని వేల మంది జీవితాలలో మార్పు తీసుకొస్తారు."

ఆగస్ట్

010898 ఆధ్యాత్మిక విద్య

భారతీయ ఆధ్యాత్మిక యొక్క ఆధార నియమాలు మనము తెలుసుకోబోతున్నాము. శరీరాన్ని ఉపయోగించుకోవటం ఎలా,శరీరం అంటే స్థూల శరీరం ఒక్కటే కాదు,కోరికల శరీరము,మనోమయ శరీరము వుంటాయి.ఏ విద్య నేర్చుకోవాలన్న మనోమయ శరీరము ముఖ్యము. మనస్సును నియంత్రణ చేసుకోవాలి. ఏ స్థితిలో వున్నా యోగ విద్య నేర్చుకోవచ్చు. మనస్సు సరైన స్థితిలో వుంటే మీరు ఏది చేసినా యోగమే

010898 యోగ సాధన

"ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానము.సైంటిస్ట్ ఒకలా జీవిస్తాడు ఇంజనీర్ ఒకలా జీవిస్తాడు. యోగ సాధన ఇవ్వడానికి నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయలు వచ్చాయి యోగవిద్య ద్వారా మీరు సాధించాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం సృష్టిని నడిపించే శక్తి యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకోవచ్చు "

150898 కృష్ణాష్ఠమి సందర్భముగా ఉపన్యాసము

శ్రీ అరవిందులవారు ఋషులు చెయ్యలేక ఎక్కడ ఆగిపోయారో అక్కడినుండి మొదలుపెట్టి దానిని సాధించి చూపించారు. బ్లావెట్స్ఖి రాసిన Secret Doctrine శ్రీ అరబిందో సావిత్రీ , ఇలా పరమ గురువులవద్దనుండి వచ్చిన అనేక పుస్తకాలు మీరు చదవాలి, అవి చదవటము ఎంత కొత్త యుగాన్ని తీసుకునిరావటానికి ప్రముఖపాత్రవహిస్తాయో అర్ధం చేసుకుని ప్రతి ప్రజ్ఞాపుత్రుడు పగలు రాత్రి కష్టపడాలి.

150898 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |ఉజ్జయిన్యాం మహాకాలమ్ ఓంకారేత్వమామలేశ్వరమ్ ||
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

180898 ఆధ్యాత్మిక ప్రాకృతిక నియమాలు

ప్రకృతి మనకి అధ్బుతమైనటువంటి శరీరం ఇచ్చింది. ఒక్క మనిషి తప్ప సృష్టి లో ఒక్క చిన్న కణం దగ్గర నుంచి ఈ విశాలమైన అంతరిక్షం లో వున్న తోకచుక్కతో సహా అన్ని సరైన క్రమమం లో వస్తున్నాయి,కాని ఒక్క మనిషి మాత్రంప్రకృతికి అనుగుణమైన జీవితం జీవించలేకపోతున్నాము .

210898 యోగ విద్య - శ్వాస ధ్యానము

స్వర యోగము ద్వారా 6 నెలల ముందే ఏమి జరుగుతోందో చెప్పవచ్చు, మీరు పడుకునేముందు, లేచే ముందు మీ శ్వాసలో జరిగే మార్పును పట్టుకోవాలి. ఫ్రతి వ్యక్తి శ్వాస ఇంకొకరి శ్వాస కంటే వేరు అనేది అర్ధము చేసుకోవాలి.

230898 యోగ విద్య - శ్వాస ధ్యానము

101 మంది ఋషుల ప్రణాళికను తన నెత్తిన పెట్టుకుని పని చేసిన శ్రీ వెంకయ్యస్వామిని పిచ్చి వెంకయ్య అన్నది సమాజము, ఆయన న దగ్గర కొండంత ఉంది దానిని ఎవ్వరూ తీస్కోవట్లెదు అని బాధపడ్డారు, ప్రతి గురువు జీవిత చరిత్రా ఇదే చెప్తోంది మనకి. యోగ విధ్యకోసము గురువుల వద్దకు వెళ్ళండి, మీ సమస్యలు తీర్చుకునేందుకు కాదు.

240898 యోగ విద్య - శ్వాస ధ్యానము

యోగ విద్య ద్వారా మనిషి దేవ మానవుడుగా మారాలి, ఈ యుగసంధి సమయములో మనము ఇక్కడ చేసే సాధనలవలన ఎన్నో ఉన్నతమైన మార్పులు ప్రకృతిలో జరుగుతున్నాయి. వాటిని మీరు గమనించుకోవాలి. గాయత్రీశాయ విద్మహే అని మీరు యజ్ఞములో వేసే ఆహుతులు ఉదయము సూర్యుడు బ్రహ్మగా సృజిస్తాడు, మధ్యాహ్నపు సూర్యుడు పోషిస్తాడు, రాత్రికి శివుడిగా తనలోకి అంతా లీనము చేసుకుంటాడు, ఈ మూడింటికి మూలమైన గురు తత్వాన్ని మీరు పట్టుకునే ప్రయత్నము చెయ్యాలి.

270898 శ్వాస ధ్యానము- సూర్యుడు

శ్వాస ధ్యానము- సూర్యకిరణాలు మన శరీరముపై ఎలాంటి ప్రభావాన్ని తెస్తాయి అనేది గమనించండి, మీ శ్వాస సహజముగా ఉండాలి.

270898 శ్వాస ధ్యానము - వేదములు

శ్వాస ధ్యానము - వేదములు - శ్వాసను అర్ధము చేసుకొనగలిగితే అగ్ని విద్య, సూర్య విద్య, చంద్ర విద్య మొత్తము మూడు విద్యలు మీకు అర్ధం అవుతాయి.

250898 గణపతి మంత్ర దీక్ష

ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి దాని గురించి చర్చించుకుంటున్నాము జెనెటిక్ కోడ్ మార్చటం వలన మనం శరీరంలోనే కాక మన బాహ్యపరిస్థితులు కూడా మార్చవచు అని చెప్తున్నారు. అలా చెప్పటానికి ఆధారభూతమైనటువంటి ఆలోచనా విధానాన్ని మనం మూల మంత్రం తో నేర్చుకుంటున్నాం .

280898 యోగ సాధనా సూత్రములు

యోగ సాధనా సూత్రములో మొదటిది మీ బాధ్యత. మీ బాధ్యతను విస్మరించినవారు యోగ సాధనకు పనికి రారు, మీ బాధ్యతలు మీరు నిర్మించినవి కావు, ప్రకృతి మీకు ఇచ్చినవి కాబట్టి మీకు ఎటువంటి పరిస్ధితులు ఉంటే మీరు ఉన్నతంగా ఎదుగుతారో ప్రకృతి మిమ్మల్ని అలాంటి పరిస్ధితిలోనే ఉంచుతుంది

290898 యోగ విద్య సూత్రములు

యోగ విద్యలో ముందుకు వెళ్ళాలంటే ఏ పనినైనా తక్షణమే చెయ్యాలి. పిల్లలకు చిన్నప్పటినుండి పని చెయ్యటము, బాధ్యతలను స్వీకరించటము నేర్పిస్తే వారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు.

310898 గాయత్రి 24 శక్తులు

12 జ్ఞాన పక్షానికి చెందిన శక్తుల జ్ఞానము ఆచరణలోకి రావాలి. ప్రకృతిలో వున్నటు వంటి 24 శక్తులు సరిగ్గా ఉపయోగించుకుంటే మానవ జన్మ సార్ధకమవుతుంది

310898 గాయత్రి స్మృతి

అపరిగ్రహము, ప్రకృతినుంచి ఏది నాది, అని వేలాడే భావం ఉండకూడదు కామన్ సెన్స్ తో వుండాలి . అయాచక వ్రతము - ఏది అడగకుండా ఉండటము . విచక్షణ తో వున్నా జ్ఞానాన్ని పట్టుకోవాలి.

310898 గాయత్రీ స్మృతి

కౌశలము అనేది ప్రతి సాధకుడికి అత్యవసరము, దేవతలు ఎప్పుడు ఎప్పుడు ఓడిపోయారో దానికి కారణము వాళ్ళు సామూహికత్వాన్ని కోల్పోవటమే. సాధకుడు అందరితో కలిసి పని చెయ్యటము అనే కౌశలత్వము పెంచుకోవాలి.

గాయత్రి మంత్ర జపం ధ్యానం

మంత్ర జపం అయిన తర్వాత ధ్యానము చేయాలి.అద్భుతమైన శక్తి కేంద్రాలని జాగృతం చేసేటటువంటి ఈ మంత్రము జపించటానికి చాలా జన్మల పుణ్య ఫలం కావాలి. ఎంతో మంది ఋషులు జపం చేసినటువంటి మంత్రము ఇది అనే ఆర్తి భావం తో జపం చేయాలి.

గాయత్రి స్మృతి

ఎదుటివాడి మానసిక స్థితిని బట్టి సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి. అది గాయత్రీ లో గో అనేటటువంటి పదము చెప్తుంది. ఇంద్రియాలు నీ వశం లో వుండాలి తప్ప ఇంద్రియాలకి నువ్వు వశం కాకూడదు ఇది దే అనే పదము చెప్తుంది.

310898 గాయత్రి శక్తి ధారలు 1

బ్రాహ్మీ శక్తి అంటే ప్రకృతి యొక్క నియమాలు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దానికి బేసిస్ కూడా ఈ బ్రాహ్మీ శక్తే . ఈ స్థితిలో వున్నవాడు బ్రాహ్మణుడు . భూమి మీద నడిచేటటువంటి దేవతలకు ఈ బ్రాహ్మీ శక్తి గాయత్రీ మంత్రము ద్వారా మీకు లభిస్తుంది. సరస్వతి అనేది బ్రాహ్మీ శక్తి యొక్క టెక్నాలజీ

310898 గాయత్రి శక్తి ధారలు 2

కేవలం విజ్ఞానం మాత్రమే సరిపోదు. దానికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలి. కాబట్టి గాయత్రీ కి సంబంధించిన 24శక్తులు ఇవి టెక్నాలగీ అవుతాయి. జ్ఞాన పక్షానికి సంబందించినటువంటి శక్తులు వేదమాత, బ్రాహ్మీ,వైష్ణవి,శాంభవి. ఈ 24 శక్తులు దుర్గలో ఎలా ప్రవేశించింది అనేది తెలుసుకుంటున్నాము

310898 గాయత్రి శక్తి ధారలు 2 (1)

ములధారము నుంచి సహస్రారము వరుకు శ్వాస ఎలా వెళ్తుంది అనేది ప్రాణాగ్ని విద్య .ప్రక్రుతి లో ఉన్నటువంటి ఆ 24 శక్తులని గుర్తుంచుకోవడానికి తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి అని కూర్చారు.ఈ మంత్రాన్ని ఉచారిస్తూ వుంటే మన శరీరం లో ఉన్నటువంటి 24 శక్తి కేంద్రాలు స్పందిస్తాయి .ఇప్పుడు మనము 24 శక్తులలో విజ్ఞాన పక్ష మార్గము ఇంకొకట్టి వామ మార్గము నేర్చుకుంటున్నాము

310898 గాయత్రి శక్తి ధారలు 2 (2)

భువనేశ్వరి సాధనని నారదుడు చేసాడు. ఈ వామ మార్గ పద్దతిలో నాభి వద్ద ఏకాగ్రతతో సంయమనం చేయగలిగిన వ్యక్తి తన శరీరం యొక్క నిర్మాణాని పూర్తిగా అర్ధం చేసుకోగలడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి జ్ఞానము నాభి నుంచి వస్తుంది

310898 గాయత్రి శక్తి ధారలు 2 (3)

ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానము. సైంటిస్ట్ ఒకలా జీవిస్తాడు ఇంజనీర్ ఒకలా జీవిస్తాడు. యోగ సాధన ఇవ్వడానికి నలంద ,తక్షిల లాంటి విశ్వవిద్యాలయలు వచ్చాయి యోగవిద్య ద్వారా మీరు సాధించాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం సృష్టిని నడిపించే శక్తి యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకోవచ్చు

310898 శ్వాస ధ్యానము

ప్రకృతి మీకు మార్గదర్శనము చేస్తూ ఉంటుంది, మీరు దాన్ని గమనించుకోండి. ఆధ్యాతమికత అంటేనే ఐశ్వర్యము, సిద్ధులు. మీరు యోగుకుగా మారాలి, యోగ సాధనకు తాళంచెవి శ్వాస.

310898 యోగసిద్ధికి సోపానములు

యోగము అంటే జపము, తపము కాదు. అనేక జన్మల పట్టి పుట్టుక చావు అనేది చూసిన మనము ఈ జన్మలో అన్నా అసలు మన జీవిత లక్ష్యము ఏమిటి? అన్న ఆవేదన తెస్సుకోకపోతే యోగ విద్యలోకి మనము ప్రవేశించలేము.

310898 గాయత్రీ శక్తిధ్యానము

గాయత్రీ శక్తిధ్యానము - గాయత్రీ మంత్రములోని ఒక్కో అక్షరము ఒక్కొక్క శరీభాగాన్ని రక్షిస్తున్న భావనతో ధ్యాన విధానము

310898 ఒకే విశ్వము - ఒకే భాష - ఒకే ధర్మము

ఇప్పుడు జరుగుతున్న యుధ్ధాలు ఎక్కువభాగము మానసిక తలములో ఎక్కువగా జరుగుతున్నాయి. మనము మన మానసిక స్ధితిని జంతు స్థాయినుండి మానవ స్థాయికి అచ్చటినుండి దేవమానవ స్థాయికి తీస్కొని వెళ్ళాలి.

సెప్టెంబర్

310898 24 గాయత్రి శక్తి ధారలు 1_ నవగ్రహ

"సూర్యుడు ఎప్పుడు అయితే ఉద్భవిస్తాడొ దిక్కులు ఏర్పడతాయి. దిక్కులు ఎప్పుడు అయితే ఏర్పడతాయో ఆ దిక్కుకు సంభందించినటువంటి గ్రహాలు ఏర్పడతాయి. ఈశాన్య దిశకి అదిపతి బుధుడు. గురువు ద్వార లభించే జ్ఞానం అఖండమయినటువంటి జ్ఞానం. ఆ అఖండ మయినటువంటి జ్ఞానం మనకి బుధుడు దగ్గర నుండి వస్తుంది"

010998 24 గాయత్రి శక్తి ధారలు 2

"ఆచరణలోకి రాని జ్ఞానం ఎందుకు ఉపయోగబడదు. ప్రకృతిలొ ఉన్న 24 శక్తులు మన శరీరంలొ కూడ ఉన్నాయి. మనిషికి కుడి చెయ్యి, ఎడమ చెయ్యి ఎలా ఉంటుదొ ఆధ్యాత్మిక జగత్తులొ కూడ దక్షిణ మార్గము, వామ మార్గము ఉంటాయి . బ్రాహ్మి శక్తి సృజనాత్మకమయిన శక్తి. ఈ సృజనాత్మకమయిన శక్తి మొట్ట మొదట భూమిలొ కనిపిస్తుంది "

020998 24 గాయత్రి శక్తి ధారలు 3

"విశ్వమాత అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబము. విశ్వమాత శక్తిని భౌతిక జగత్తులొ దింపేటటువంటి శక్తిని భవాని అంటాము. భవాని అంటే విశ్వమంతా ఒకటే అనే ఆలోచనలకు అడ్డు తగిలె పరిస్థితులను రూపుమాపాలి. "

030998 24 గాయత్రి శక్తి ధారలు 4

"వేదమంత్రాలను అర్ధం చేసుకోవడానికి, ఋతుంభర ప్రజ్ఞ జరగడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ప్రకృతి ఎప్పుడు ఏది చేసినా అది మన మంచికే. శ్వాస మీద దృష్టి. ఋతుంభర ప్రజ్ఞ యొక్క స్థూల జగత్తులొ పనిచేసె శక్తి భువనేశ్వరీ, భువనేశ్వరీ సాధన అంటె 14 భువనాలలొ ఎక్కడ ఈ విధమయినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు తగినట్లు ఆచరించగలగటం భువనేశ్వరి సాధన. "

040998 24 గాయత్రి శక్తి ధారలు 5

"అణువుల యొక్క కదలికే వాయువు. వాయువుకి స్వయంగ ఏ ఉనికి లేదు. అణువులు మన శరీరానికి తగిలే వేగాన్ని వాయువు అంటున్నాము . వాయువు వలన విజ్ఞానమయ కోసం ఉద్భవిస్తుంది. ఆనందమయ కోశానికి కారణ మయినటువంటి జలతత్వము, విజ్ఞాన మయకోశానికి కావలసినటువంటి వాయు తత్వము, మనోమయ కోశానికి కావాల్సిన నటువంటి అగ్నితత్వము ఏర్పడ్డాయి "

040998 గాయత్రీ వర్ణ ధ్యానము

గాయత్రీ వర్ణ ధ్యానములో గాయత్రీ మంత్రములోని ఒక్కొక్క అక్షరముపై ధ్యానము ఎలా చెయ్యాలి? దానివలన కలిగే ఫలితములు ఏమిటి అనే వివరణ

040998 గాయత్రీ వర్ణ ధ్యానము

గాయత్రీ వర్ణ ధ్యానములో గాయత్రీ మంత్రములోని ఒక్కొక్క అక్షరముపై ధ్యానము ఎలా చెయ్యాలి? దానివలన కలిగే ఫలితములు ఏమిటి అనే వివరణ

080998 గాయత్రీ రామాయణము 1

సుగ్రీవుడు - వాక్కు - రెండు స్వరపేటికలు గాలికి కంపిస్తూ ఉంంటాయి, ఆ రెండింటి వల్లే శబ్ధాలు అనంటముగా ఏర్పడుతున్నాయి, విశుధ్ధి చక్రము వల్ల ఇది జరుగుతోంది. మన శభ్దాలకు, మిగతా ప్రాణుల శబ్ధాలు మన వలె రక రకాల భావ పరంపరలను తెలుపలేవు. అది మానవుడికి మాత్రమే సాధ్యము.

080998 గాయత్రీ రామాయణము 2

రాక్షసుడు అనగా - యజ్ఞఘ్నాన్ - యజ్ఞములను ధ్వంసము చేసేవాళ్ళు రాక్షసులు. యజ్ఞము అనగా ప్రకృతియొక్క చక్రీయ క్రమము , దీన్ని భంగపరిచేవారు రాక్షసులు. ముందు రాక్షసత్వము అంంటే ఏమితో సరిగ్గా అర్ధము ఐతే అప్పుడూ మనము ఏ స్థాయిలో ఉన్నామో మనకే అర్ధం అవుతుంది.

110998 దేవాలయాలు

గాయత్రి సాధనకి ద్వాదశ రాశులకి వున్న సంబంధం చేపుకున్తున్నాం. ప్రారబ్ద కర్మ మాత్రమే తెలుసు ఇప్పుడు మనకి సంచిత కర్మ గురించి తెలియదు. ఆగామి కర్మ ఎలా ఏర్పడుతుంది సంచిత కర్మ ప్లస్ ఇప్పుడు చేసుకున్నటువంటి కర్మ. జ్యోతిశాస్త్రం నిజంగా అధ్యయనం చేసుకుంటే ఈ ప్రారబ్ద కర్మ యొక్క స్పష్టమైన అవగాహన వస్తుంది. గాయత్రి మంత్రం అందరూ చేసుకుంటే సంచిత కర్మ తగ్గుతుంది. ప్రతి రోజు ఆత్మవలె జీవించాలి

110998 జన్మ కర్మ తపస్సు

గాయత్రీ మంత్రము అందరూ చేస్కొండి అని 1875 సంవత్సరమునుండి గురువులు గాయత్రీ మంత్రము చేస్కోంది, దానివలన మీ సామూహిక కర్మలు మారతాయి అని చెప్తే మీరు అది తప్ప అన్నీ చేస్తారు. ఏ వ్యక్తి ఐనా 5 రకాల కర్మలను పూర్తి చేసుకునేందుకు పుడతారు - 1.మృత్యువు యొక్క రహస్యాన్న్ని చేదింఛాలి ( ఆత్మ బోధ- తత్వబోధ)మిగిలిన అయిదింటిణి ప్రవచనములో వినగలరు.

110998 ప్రారభ్ద సంచిత కర్మలు - తపస్సు

సంచిత కర్మ - అనేక జన్మలనుండి మూటలు మోస్తున్నాము. 12 రకాల తపస్సులనుగురుంచి వివరణ

010998 గాయత్రీ ఉపనిషత్

" నిరంతరం గురు సాన్నిద్యంలొ ఉండాలి. ఈ శరీరం నాది కాదు గురువుకి ఇచ్చెసాను అనే భావన ఉండాలి. ఏ పని చేసినా గురువే నా ద్వార ఈ పని చేయిస్తున్నాడు అనే భావన ఉండాలి, నేను చేస్తునాను అనే భావన ఉండకూడదు. "

040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 1

మీకు నచ్చని వాళ్ళు మీకు శత్రువు అయినటువంటి వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంటే కఛ్చితంగ వాళ్ళ దగ్గరకి తగినటువంటి శ్రద్ధతో తగినటువంటి భక్తితో వెళ్ళాలి. మీ లోపల ఉన్న అహంకారాన్ని గురువు మాత్రమె గుర్తించగలడు. గురువు యొక్క సమక్షంలొ గురువు యొక్క జ్ఞానంతొ శిష్యుడు కూడ గురువు లాగ మారాలి

040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 2

కష్టపడి పని చెయ్యండి. అది ఒకటే గాయత్రి మంత్రంలొ ఉన్న మూలం. కష్టపడి పని చేస్తె శ్రద్ధ విశ్వాసాలతొ మీరు ఎలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారొ అలాంటి పరిస్థితులు దాని అంతట అవే ఏర్పడతాయి. మనకి కావాల్సిన గాయత్రి సాధన మనం చేస్తుంటాము. జంతువులకు కావలసిన గాయత్రి సాధన జంతువులు చేస్తు ఉంటాయి. గరుడుడు విష్ణువుకి వాహనం కాగలిగాడు. సింహము దుర్గకి వాహనము కాగలిగింది.

040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 3

"నిరంతరము ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రము లక్ష్యం మీద ఉండాలి దానినె శ్రద్ధ అంటారు. నిరంతరం లక్ష్యాన్ని పొందటానికి ఎలా చెయ్యగలిగితె అలా చెయ్యాలి. సాధన అంటూ మొదలు పెడితే ఎప్పుడొ ఒక్కప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటారు. గాయత్రి సాధన ద్వార శ్రీని, ప్రతిష్టని, జ్ఞానాన్ని ని పొందగలరు"

040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 4

" ప్రకృతి నుండి శక్తులను ప్రతిష్టించుకొని ఆ శక్తులను ఎప్పుడు ఏది కావలొ ఉపయోగించుకునే విధానము యజుర్వేదము. యజుర్వేదము యజ్ఞము ద్వారా మనం అంతరిక్షంలొ ఉన్న శక్తులను కిందకు దింపుకోవచ్చు అని చెప్తుంది. మనకు ఏది కావాలంటే అది అంతరిక్షంలొ ఉంది. ఋగ్వేదము సూర్య కిరణాలు పదార్ధంగ మారడం. సూర్యుడు యొక్క అన్ని కిరణాలు ఎక్కడికి వెళుతున్నాయో సామ వేదం తెలుపుతుంది. "

040998 గాయత్రీ ఉపనిషత్ పార్ట్ 5

" గాయత్రీ సాధకుడు పూర్వ జన్మ సంస్కారాల వలన ఏ విధమయినటువంటి పరిస్థితి లబిస్తుందో అక్కడ ఆనందమయంగ జీవిస్తాడు, ఏదీ కోరుకోడు. యోగపరమయినటువంటి అలోచనా విధానము, శాస్త్ర పరమయినటువంటి జీవిత విధానము. అయాచక వ్రతము, అపరిగ్రహ వ్రతము పాటిస్తూ ఉంటాడు. "

080998 ( జి ఎం వి) గాయత్రీ మహా విజ్ఞాన్ వేదములు

" మనకు ఏది మంచిదో మనకంటే ప్రకృతికే బాగా తెలుసు అన్న విశ్వాసము, శ్రద్ధ ఉండాలి. సామర్ధ్యము ఉపయోగించకుండా, తెలివి తేటలు ఉపయోగించకుండా ఎదుటి వాడిని మోసం చేసి సంపాదించిన ఏ డబ్బు కూడ నిలవదు. కల్యాణ కరమయిన ఆలొచనలు ఎక్కడ ఉన్నా అది ఋగ్వేదము. "

060998 గాయత్రీ శాప విమోచనము గాయత్రీ రామాయణము

శాపం అంటె అవరోధాలు. కొన్ని శక్తులు కొన్ని చోట్ల అనవసరం. అందుచేత వాటికి అవరోధం కలిగించటానికి శాపం. శాపం గాయత్రికి లేదు. గాయత్రి యొక్క ఉపయోగాన్ని అవసరం ఐనప్పుడు ఉపయోగించు కోవటం అవసరం లేన్నపుడు మూసివేయటం.

070998 గాయత్రీ రామాయణము

నిద్రలేచిన దగ్గర నుండి పడుకునేవరకు కూడ ఒక వ్యవస్థగ నిర్ణీతమయిన లక్ష్యాన్ని పొందటానికి ఉపయోగించు కోవాలి. మంచి పని అయితే తక్షణమే చెయ్యాలి.

080998 గాయత్రీ రామాయణము

"ఆధ్యాత్మిక జగత్తులొ మీరు ముందుకు వెళ్ళాలంటె దేవతలవలె మీ వద్ద ఉన్నదాన్ని ప్రపంచంకోసం ఉపయోగించండి. ఆధ్యాత్మిక సాధకులకు, గాయత్రి సాధకులకు ఒకటె కులం."

090998 కుండలినీ సాధన దేవాలయములు పండగల విశిష్ఠత

మానవ శరీరధారి ఎవరయినా సరే సంచిత ప్రారబ్ధ కర్మను పూర్తి చేసుకోవడానికే పుడతాడు. ఎవరి ప్రారబ్ధ కర్మను బట్టి వారికి అలాంటి శరీరం వస్తుంది. మానవునికి ఒక లక్ష్యం మృత్యువు యొక్క రహస్యాన్ని చేధించుట. అది చేధించటానికి ప్రతి రోజు రాత్రి నిద్ర పోయెటప్పుడు మృత్యువు , ప్రతి రోజు పొద్దున్న నిద్ర లేచిన తరువాత కొత్త జన్మ అని అనుభూతి చెందుతూ ఉండటమే. ఓక ఆత్మలాగ జీవించగలగటం .

110998 కుండలినీ ధ్యానము

సర్వము మరిచి జ్యోతి మీదదృష్ఠి భృకుటి దగ్గర జ్యోతి దర్శనం, చాలా రిలాక్స్డ్ గా జ్యోతిని దర్శించండి. శరీరము ఏ స్థితి లో వున్నా పర్వాలేదు ఆ మానసిక స్థితి లో వుండాలి. ప్రతి రోజు మంత్ర జపం అయ్యాక ఈ సాధన చేసుకోవాలి.

090998 ఋషి మహర్షి

"బుద్దిని ఉపయోగించుకొనే శక్తి మనిషికి ప్రకృతి నుండి వస్తుంది. ప్రకృతి యొక్క శక్తులను తన అవసరాలకు ఉపయోగించు కొనేవాడు బలవంతుడు. బుద్ది బలం ఉన్నవాడు తను సాధించ వలసిన కార్యక్రమాలని సాదించగలుగుతాడు. "

110998 సూక్ష్మ జగత్

గాయత్రి,అమ్మని చూస్తూ వుండండి ,ఈ చిత్రము అతిచేతనత్వ స్థాయిని కూడా దాటినటువంటి ఋషులు నిర్మించినది మనము నిజం గా ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క చిత్రము కూడా ఇక్కడ ప్రతిబింబిస్తుంది. మిమల్ని బ్రహ్మ స్థాయిలోకి తెసుకువెళ్ళడానికి ఆవిడ వస్తుంది. గాయత్రి మంత్రము యొక్క అర్ధాని ౩ యోగాలుగా తెలుసుకుంటాము ( కర్మ, భక్తి, జ్ఞాన ). భగవత్ శక్తిని మనం ఓం అని పిలుస్తాము

110998 తపస్సు కర్మ

పుస్తకాలు చదవడం మాత్రమే కాదు వాటిని ఆచరణలోకి పెట్టాలి. యోగి అనేటటువంటి వాడు నిరంతరము స్మరణ లో వుండాలి. ఋషిమయ జీవితం అలవరచుకోకుండా కుండలిని జాగరణ మీకు రాదు. 6 చక్రాలు మరియు వాటి దళ్లాలు బాగా అధ్యనం చేసుకోవాలి. మనసు నుంచి మొదలెట్టాలి. ఆజ్ఞ లో వుంది అంచేత కుండలిని జాగరణ మొత్తం ఆజ్ఞ చక్రం నుంచి మొదలవుతుంది

110998 తపస్సు

పుస్తకాలు చదవడం మాత్రమే కాదు వాటిని ఆచరణలోకి పెట్టాలి. యోగి అనేటటువంటి వాడు నిరంతరము స్మరణ లో వుండాలి. ఋషిమయ జీవితం అలవరచుకోకుండా కుండలిని జాగరణ మీకు రాదు. 6 చక్రాలు మరియు వాటి దళ్లాలు బాగా అధ్యనం చేసుకోవాలి. మనసు నుంచి మొదలెట్టాలి. కుండలిని జాగరణ మొత్తం ఆజ్ఞ చక్రం నుంచి మొదలవుతుంది

110998 ప్రారభ్ద సంచిత కర్మలు - తపస్సు

సంచిత కర్మ - అనేక జన్మలనుండి మూటలు మోస్తున్నాము. 12 రకాల తపస్సులనుగురుంచి వివరణ

300998 ఆస్ట్రాలజీ & వాస్తు

ఆస్ట్రాలజీ & వాస్తు - 12 రాశులలో 6 రాశులు ఇచ్చే రాశులు, 6 తీస్కొనే రాశులు, స్థిర స్వభావ రాశులు, చర స్వభావ రాశులు, ద్వి స్వభావ రాశులు . మొదట స్ధిర రాశి - మేషము.

అక్టోబర్

011098 Navaratri Rushimaya Alochana

ఋషులయొక్క వాక్కులోని వరాలిచ్చే శక్తి, శపించే శక్తి మీరు తెలుసుకోవాలి అంటే ప్రకృతి నియమాలు అర్ధము చేసుకోవాలి. ప్రకృతి నియమాలకు లొంగిపోతే కానీ మీరు పంచతత్వాలపైన ఆధిపత్యాన్ని సంపాదించలేరు.

211098 భగవద్గీత

గీత యొక్క జీవిత విధానాన్ని అర్ధం చేసుకుంటూ ఒక అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఏమిటది, ప్రకృతి లో మానవ శరీరము పొందినటువంటి మనము ఖచితంగా భగవంతుడి యొక్క అంశ మనలో వుంది.

011098 ఋషుల అనుమతి

ఋషులయొక్క వాక్కులోని వరాలిచ్చే శక్తి, శపించే శక్తి మీరు తెలుసుకోవాలి అంటే ప్రకృతి నియమాలు అర్ధము చేసుకోవాలి. ప్రకృతి నియమాలకు లొంగిపోతే కానీ మీరు పంచతత్వాలపైన ఆధిపత్యాన్ని సంపాదించలేరు.

071098 యోగస్ధితి

నిద్రా స్ధితిలో జరిగే మార్పులను అర్ధం చేసుకోండి. పగలు మీరే చేసే కార్యక్రమాల యొక్క ప్రభావము రాత్రి మీ నిద్రాస్ధితిపై ఉంటుంది అని తెలుసుకుని చెయ్యండి.

141098 పృధ్వీ దీక్ష - మాష్టారి జన్మదినము

ధరణీ మాత దీక్ష తీసుకున్నది, దానికి సహకరించిన ప్రతి వ్యక్తి యొక్క పాత్ర చాలా ప్రముఖమైనదే. శ్రీశైలం యొక్క నాలుగు ద్వారాలను సాధకులకు అనువుగా మర్చాలి. త్రిపురాంతకం, ఉమామహేశ్వరం, సిధ్ధ హఠం ఆలంపురం .

261098 కర్మ యోగము

శ్రద్ధతో అసూయారహిత స్ధితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏది చేసినా అది కరెక్ట్ అవుతుంది . ఎందుకు జన్మ ఎత్తాము ఎందుకు నాకు మరణము వస్తోంది అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ భగవత్ గీత సాధన అర్ధం చేసుకుంటే మీకు ఆ విషయం తెలుస్తుంది

291098 కర్మ యోగము

మనవ జీవితం లో రెండు విధాలైనటువంటి విద్యలు అని భారతీయ ఋషి సాంప్రదాయము మనకు చెప్తుంది అవి పరావిద్య, అపరావిద్య పరావిద్య ప్రకృతి యొక్క విద్య మనము కూడా ప్రకృతి యొక్క భాగమే కనుక ప్రకృతి యొక్క శక్తులతో తదాత్మ్యత చెంది తనను తాను మర్చిపోవటము పరావిద్య.

నవంబర్

081198 కర్మ యోగము

శ్రద్ధతో అస ుకోవాలి. ఈ భగవత్ గీత సాధన అర్ధం చేసుకుంటే మీకు ఆ విషయం తెలుస్తుంది .

201198 సావిత్రీ

వ్యక్తి ఎవరి మీద ఆధారపడకుండా కేవలము ప్రకృతిపై అధారపడి జీవించటము అనేది సావిత్రీ విద్యలో మనము నేర్చుకోవలసిన ముఖ్య విషయము. బిడ్డ తల్లి గర్భములో ఉండగా జరిగే మోత్తము సమయాన్ని ఈ గ్రంధములో వివరించారు శ్రీ అరవిందులవారు. ద్యూమత్సేనుడూ ధృతరాష్ట్రుడు అన్నా ఇద్దరూ ఒకే లక్షణాలు కలిగినవారు.

డిసెంబర్

251298 మహా యుగము

ఆ యోగమాయా శక్తి పంచాతత్వాల రూపములో పంచ భూతాల రూపం లో వుంటుంది. ఆ చరణాల యొక్క పిల్లలము మనము అనేటటువంటి భావన తో వుండాలి. ఏ కోరికలు లేనటువంటి స్థితిలో వుండాలి. నా శరీరాన్ని నా మనస్సుని నీకు సమర్పిస్తున్నాను.

251298 విష్ణు సహస్ర నామము

By MS. Subbalakshmi

251298 శ్రీ మాహాయోగేశ్వరీ దేవి అవతరణ

భారతదేశముపై ఆ మహాయోగేశ్వరీ దేవి పాదముల నుండి మొదలుకొని ఆవిడ సప్త వర్ణములతో ఉండే ముఖమువరకు ఉన్న వర్ణనపై ధ్యానము.

1998 గాయత్రీ1

ప్రతి వ్యక్తి ఎప్పుడైతే స్థూల శరీరము ధరిస్తాడో ఆ క్షణములో చుట్టురా ఉన్నటువంటి ౩ పరిస్థితులకు బధ్ధుడైవుంటాడు, వాటినే ౩ గ్రంధులు లేక ౩ బంధాలు అంటాము. కుండలిని ప్రక్రియలో కుటుంభ పరిస్థితులు విష్ణుగ్రంధి ,పెద్దవాడై సమాజంలోకి వచ్చినపుడు పరిస్థితులు రుద్రగ్రంధి, మనిషి మీద ప్రకృతి యొక్క ప్రభావము బ్రహ్మగ్రంధి.

1998 గాయత్రీ2

గాయత్రీ బ్రాహ్మి యొక్క ప్రిన్సిపల్ ఒకటే సాముహికమైనటువంటి జీవనము జీవించటము. ఎప్పుడైతే సాముహిక కోరికలు కోరతారో అప్పుడు విష్ణు గ్రంధి నుంచి శివ గ్రంధికి శివ గ్రంధి నుంచి బ్రహ్మ గ్రంధి కి వస్తాము. సత్సంకల్పాలు బ్రహ్మ గ్రంధి యొక్క జాగరణ కొరకు పెట్టినది. సేవ అంటే ఎదుటివాడికి కావలసినది ఇవ్వటము, మనకు నచ్చినది చేయటము కాదు. స్వాధ్యాయ సత్సంగాలలో సహజంగానే సాముహికత వుంటుంది కనుక బ్రాహ్మి గ్రంధి ఆక్టివేట్ అవుతుంది.

1998 చక్రములు

స్థూల జగత్తులో ఈ 6 చక్రాలు వుంటాయి. మనిషి 6 గుణాలు కనుక అలవరుచుకుంటే షట్చక్ర జాగరణ జరిగిపోతుంది. మనము ఏ పని చేస్తున్నా ఈ 6 చక్రాలు ఉపయోగించుకుంటాము .సహనము కనుక అలవరుచుకుంటే మూలాధారము యొక్క జాగరణ జరిగిపోతుంది.ఈ మూలాధారము యొక్క జాగరణ జరిగినప్పుడు నాడి మండలం లో వచ్చేటటువంటి శబ్దము లం అని వస్తుంది

1998 కుండలిని 1

శరీరమే ఒక ప్రయోగశాల. ఈ శరీరము నేను కాదు, ఈ బాధలన్నీ శరీరపరమైనవి తప్ప ఆత్మవి కాదు. ఏదైతే మనలో ద్రష్ట గా వుందో అది నేను. పునర్జన్మ ఏదైతే ఎత్తుతోందో ఆ నేను అనేటటువంటిది 7తలాలని దాటుతుంది ఆ తర్వాత అది పనిచేయటం మొదలుపెడుతుంది.

1998 కుండలిని 2

గాయత్రీ ని విశ్వమాత , వేదమాతా , దేవమాతా అనే మూడు రకాలైన శక్తులుగా కొలుస్తాము

1998 కుండలిని 3

గాయత్రిమంత్రానికి కధ ఏంటి అంటే యోగనిద్రలో వున్నటువంటి విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ వస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మని సృష్టి చేయమని చెప్తాడు. ఆ తర్వాత బ్రహ్మ గాయత్రిని జపిస్తాడు అప్పుడు గాయత్రి యొక్క శక్తి నుంచి సృష్టి ప్రారంభమవుతుంది. ఏకముఖి గాయత్రి,ఏకముఖి లో మనిషి యొక్క చేతనత్వము వికసిస్తుంది

1998 కుండలిని 4

ప్రపంచం మొత్తం సుఖంగా వుండాలి అని ప్రార్ధన చెస్తునాము అదే సహస్రార చక్ర జాగృతం అంటే . 7చక్రాలు వున్నాయి ప్రతి శరీరం లో అంటే 7 ఫోర్సు సెంటర్ వున్నాయి . ఒక్కొక ఫోర్సు సెంటర్ ఒక్కొక రకమైనటువంటి శారీరక గతివిధులని కంట్రోల్ చేస్తుంది. సృష్టి మొత్తం కూడా మణిపూరక చక్రం నుంచి మొదలవుతుంది

1998 కుండలినిబ్రహ్మ గ్రంధి

ప్రతి వ్యక్తి ఎప్పుడైతే స్థూల శరీరము ధరిస్తాడో ఆ క్షణములో చుట్టురా ఉన్నటువంటి ౩ పరిస్థితులకు బధ్ధుడైవుంటాడు, వాటినే ౩ గ్రంధులు లేక ౩ బంధాలు అంటాము. కుండలిని ప్రక్రియలో కుటుంభ పరిస్థితులు విష్ణుగ్రంధి ,పెద్దవాడై సమాజంలోకి వచ్చినపుడు పరిస్థితులు రుద్రగ్రంధి, మనిషి మీద ప్రకృతి యొక్క ప్రభావము బ్రహ్మగ్రంధి.

1998 పంచకోశ జాగరణ

మనము ఏ విషయాన్నైనా ప్రకృతి నుంచే నేర్చుకుంటాము. కుండలిని జాగరణ లో స్తూల సుక్ష్మ కారణ శరీరాల జాగరణ మరియు పంచకోశ జాగరణ కూడా ఏక కాలంలో ఈ మూడు సాధనాల ద్వారా పొందొచ్చు, అవి మౌనము, ధ్యానము, జపము.