Our Master's Voice

మన మాష్టారి వాణి - వైజ్ఞానిక ఆధ్యాత్మికతకు కొత్త బాణి
1996 YEAR

జనవరి

140196 ఉపాంశు జపం

ప్రేమతత్వం ఉన్న చోట దోషాలను గుర్తించము. ఇంకా ఎవరినయితె ప్రేమిస్తున్నామొ ఏమి చెయ్యగలము వారికి అని ఆలోచిస్తాము .నాకు ఏమి లాభం అని ఆలోచించము. ఆ సేవా భావము,ప్రేమ తత్వము పరస్పరం కలిసి ఉంటాయి ఎప్పుడు కూడ. ఈ ప్రేమ తత్వాన్ని మనం వేద జ్ఞానం ద్వార పొందుతున్నాం.ప్రపంచంలొ ప్రతి వ్యక్తి మీద నిరంతరం ప్రేమ తరంగాలు ఉద్భవిస్తు వాళ్ళను ముంచెత్తు ఉండాలి.

130196 ఓంకారం

మన జన్మ సార్ధకము చేస్కోవాలంటే జాగృత, స్వప్న సుషుప్థావస్థలలో మనకు పూర్తి ప్రావీణ్యతను సాధించాలి.

260196 ఓంకార సాధన

శక్తి ప్రచోదనం అంటె శక్తి జాగృతం అవ్వటం. ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది.ఎలాంటి బలహీనత లేకుండ శక్తి జాగృతం అవ్వాలంటె సాధన ముఖ్యము.మనలొ ఉన్నటువంటి అంతర్ శక్తిని జాగృతం చెయ్యటానికి ఓంకారాన్ని ఉపయోగిస్తాము.

270196 పంచకోశ జాగరణ

అన్నమయకోశం ఎరుపు రంగు ధ్యానం. ప్రాణామయ కోశం కాషాయ రంగు ధ్యానం. మనోమయ కోశం పసుపు రంగు ధ్యానం, విజ్ఞానమయ కోశం అకుపచ్చ రంగు ధ్యానం , సర్వం వ్యాపించి ఉన్న నీలాకాశము అనందమయ కోశము నీలం రంగు ధ్యానం

270196 సుపర్ణ సూక్తం

అగ్నికి యోగ విధ్యకు చాల దగ్గర సంభందము ఉంది.సంస్కారాలను మార్చాలి అంటే అగ్నినే ఉపయోగించు కోవాలి. ఉప అంటే దగ్గరగ నయనం అంటే కన్ను అంటే చాల దగ్గరగ చూడగలిగింది . ఆత్మ మనకు చాల దగ్గర ఉంది ఆ పరమత్మ మనకు చాల దగ్గరగ ఉన్నాడు. ఆ పరమాత్మను చూడటానికి ఉపనయన సంస్కారం.

140196 శ్వాస

"దేవ సంస్కృతి అన్నా భారతీయ సంస్కృతి అన్నా ఒకటే. అహో రాత్రులలొ మనిషి 21 వేల 600 సార్లు శ్వాసను తీసుకుంటాడు. మీరు ఉందయం 1000 శ్వాసలు రాత్రి 1000 శ్వాసలు మాత్రమే తీసుకుంటె బ్రహ్మ జ్ఞానం మీకు వచ్చేస్తుంది. లాహిరీ మహాశయగారికి వారి గురువు నేర్పినది ఈ విద్యే ."

190801 సహజ కుంభక రేచరం

వయసు అత్మకి రాదు. మనం వెళ్ళవలసిన దారి ఆత్మ జ్ఞానం వైపు కనుక వయసుతో సంబంధం లేదు. ధృవుడు ,ప్రహ్లాదుడు చిన్న వయసు లోనె సాధన చేసి ఆత్మజ్ఞానం పొందారు. ఏ వయసు వారు అయినా ఆధ్యాత్మిక సాధన శ్రద్ధతొ చేసి ఫలితాలు సాధించవచ్చు

260196 వ్యాహృతుల సాధన

ఆ ఉ మ అన్నా పావక పవమాన శుచి అన్నా ఒక్కటే. ఎందువలన అనగా అ ఉచ్చారణ చేసేప్పుడు ఏర్పడే ఘర్షణ వలన అగ్ని వస్తుంది. ఓంకార సాధన వల్ల విద్యుత్తును ఉత్పత్తి చెయ్యవచ్చు.

మే

02051196 సంపన్నవంతులు అగుట ఎలా

" గొప్పవాళ్ళు కావటానికి దీర్ఘ శ్వాస తీస్కొనే అలవాటు చేసుకోండి. ఎప్పుడు వెన్ను నిటారుగ పెట్టి కూర్చోండి. మీరు ఎవరిని ఆదర్శంగ తీసుకుంటున్నారొ అలా మీరు మారితె ఎలా ఉంటారొ ఊహించుకోండి."

02051996 లలితాశ్రమము

బాహ్య పరిస్థితులు మనల్ని ఎంత బాధ పెట్టినా , బాహ్య వాతావరణంలొ మనకి ఎంత సుఖంగా లేక పోయినప్పటికి కూడా భగవంతుడు మీద విశ్వాసము పోకూడదు. లలితా దేవి యొక్క అనుగ్రహం,లలితా దేవి యొక్క ప్రేమ ,లలితా దేవి యొక్క సాన్నిధ్యము మనకు లభించాలి అంటే నామ పారాయణ చెయ్యండి. ఆ తల్లె మీకు దారి చూపిస్తుంది

05051996 మహాకాల యజ్ఞము

"పసుపు రంగు ప్రారబ్ధ కర్మను నాశనం చేస్తుంది. గురువుల ఆశీర్వాదం వలన పసుపు రంగు కిరణాలు మనల్ని సఫలీకృతం వైపు తీసుకు వెళుతున్నాయి అనే భావన. ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాసతో పాటు ప్రాణశక్తి లోపలికి వెళుతు శరీరం అంతా చైతన్యం అవుతోంది అనే భావన చెయ్యండి"

020596 సీక్రెట్ డాక్ట్రిన్

మీరు ఎన్ని కష్టాలను అధిగమిస్తె అంత ఎత్తుకు ఎదుగుతారు. కష్ట పడకుండ ఆధ్యాత్మిక సాధనలొ ఎదగలేరు. ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడు మునిగి పోడు. మన అందరిలొను ఒకటె శక్తి పని చేస్తుంది అదె ఆధ్యాత్మికత.

250596 గురుస్తవనము

పృధ్వి నాశనం అవ్వవలసిన పని లేదు. ఈ పృధ్వి లొ ప్రతి ఒక్కరు కూడ అమృతత్వాన్ని సాదించగలడు. అమృతత్వానికి ప్రతీకలు దేవతలు . ఏ దేవతను కొలిచిన అమృతత్వం వైపుకె వెళతారు.శ్వాశ సంకల్ప శక్తి దీనితొ పాటు సూర్య విజ్ఞానము ,యజ్ఞ విధ్య కలిపితె కాని ఆ అమృతత్వము మనుషులకు అర్ధ మయ్యె బాషలొ భూమి మీదకు రాదు అని శ్రీరామశర్మ అచార్య చెప్పారు.

250596 విశ్వకుండలినీమంధన

"ప్రపచంలొ ప్రతి పదార్ధానికి నిర్ధారిత శక్తి ఉంది. విద్యుత్ శక్తి మూలాధారం అయితే ఆ విద్యుత్ శక్తి యొక్క సహస్రారం కుండలిని శక్తి. ప్రాణము కుండలినీ శక్తి మీధ ఆధారపడి ఉంది. ప్రాణమును cyclic process పైకి కిందకి మధించ గలిగితె ఎక్కడొ అక్కడ ప్రకృతిలో ఉన్న కుండలిని frequency కి మీ frequency కలుస్తుంది."

270596 త్రిముఖీ గాయత్రీ సాధన

ప్రతి కర్మకు ప్రాయిశ్చిత్త విధానము ఉంది దానినే దానము దక్షిణ అన్నారు. దానము చెయ్యటం నేర్చుకోవాలి. ముఖ్యముగ జ్ఞాన దానము. అన్ని దానముల కంటె కూడా జ్ఞాన దానము చాల గొప్పది. ఇతరులలొ ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి నా కున్నటువంటి జ్ఞానాన్ని దానము చేస్తాను. జ్ఞానాన్నిదానము చెయ్యటం వలన ఏ ప్రతిఫలము ఆశించము అనే భావన గాయత్రి మంత్రం లోని 'దేవస్య' దేవతా లక్షణం ప్రతిఫలం ఆశించ కుండ ఇవ్వటం.

జూన్

260196 వ్యాహ్రుతుల సాధన

నిజమయినటువంటి గురువు మీకు భౌతికంగా లభ్యము కాడు. భౌతికంగా లభ్యమయ్యే గురువు భౌతికంగా మీతొ మాట్లాడే గురువు మీ నిజమయిన గురువు వైపుకు తీసుకు వెళ్ళెవాడే తప్ప నిజమయిన గురువు కాడు.

జులై

290796 గురు పౌర్ణమి

అహంకారము తీసివేసే మంత్రము గాయత్రీ మంత్రము. గాయత్రీ మంత్ర సాధకుడుకి అహంకారము రాదు. గాయత్రీ మంత్రానికే ఆంక్షలు వెయ్యడం మొదలు పెట్టాము భారత జాతి నిర్వీర్యమయిపోయింది. ఆ నిర్వీర్యమయిపోయిన భారత జాతి తిరిగి పునరుద్ధింపబడాలంటే గాయత్రీ మంత్రం ఒక్కటే మార్గము.

అక్టోబర్

141096 డా. ఆర్.కె జన్మదినం

గాయత్రీ మంత్రం తప్ప వేరే ఏ మంత్రము వేదాలను కిందకు తీసుకు రాలేదు. ఆ వేదాలను దింపటానికి 1875 నుండి మన దేశంలొ ఆర్యసమాజం అనె పేరుతో, విదేశాలలొ థియొసాఫికల్ సొసైటీ అనే పేరుతో గాయత్రీమంత్రం జరుగుతూ వచ్చింది.

211096 గురు దీక్ష

ప్రతి సంవత్సరం సద్గురువులయొక్క అనుగ్రహం సంపూర్ణ మానవాళి మీదకు ప్రసరిస్తూ ఉంటుంది. అది బీజ రూపంలొ మీలొ ప్రవేశిస్తుంది. ఆ బీజాలను పెకిలించ కుండ పెంచిపోషించి కాపాడుకోవలసిన బాధ్యత మీపైనె ఉంటుంది.

డిశంబర్

251296 పంచీకరణసాధన

సాధకుడు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. భగవంతుడుకి ఏది అర్పించినా అది సాత్విక ఆహారంగానే మారుతుంది. అందుకనే మనం తీసుకునే ఆహారం భగవంతుడికి అర్పించి తినాలి. ఆహారాన్ని బట్టి సంస్కారాలు ఏర్పడతాయి.